Priya Prakash Varrier : కన్ను గీటి యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. 2018లో నీ వానం నాన్ మఝాయ్ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావట్లేదు. 2018లో రావాల్సిన శ్రీదేవీ బంగ్లా సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి... చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్... సోషల్ మీడియాలో మాత్రం చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మోడలింగ్ చేస్తూ... బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ఓ తెలుగు సినిమా చేస్తోంది, ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. తాజాగా మహేష్ బాబు సినిమాలో ప్రియా యాక్ట్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈభామకు సోషల్ మీడియా అకౌంట్ అయిన ఇన్స్టాగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంది. ప్రతి రోజు ఎవరో కావాలనే ఆమెను పని గట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది భరించలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.