Chiranjeevi : చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రతి యేడాది మన దేశంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటూ మన దేశం తరుపున అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించడం గత 50 యేళ్లకు పైగా కొనసాగుతూ వస్తోంది. ఈ యేడాది 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా చిరంజీవిని కేంద్రం ఎంపిక చేసింది. Photo : Twitter
53వ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ రోజు (నవంబర్ 20) నుంచి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. గతంలో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ వంటి వారు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈ నెల 28లోపు ఏదో ఒక రోజు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఈయనకు ఈ అవార్డును ఇవ్వనుంది. చిరంజీవి 150 చిత్రాల్లో అభిమానులను అలరించారని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ సందర్భంగా వెల్లడించారు. (Twitter/Photo)
ఈ క్రమంలో చిరంజీవికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా భారత ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో రాస్తూ... చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు.. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
చిరంజీవి విషయానికొస్తే.. ఈ యేడాది ఆచార్యతో భారీ ఫ్లాప్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ’గాడ్ ఫాదర్’ మూవీకి గుడ్ టాక్ వచ్చినా.. ఆశించిన మేర వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. త్వరలో ఈయన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో పలకరించనుంది. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేయడంపై మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Twitter/Photo)
IFFI (International Film Festival Of India) : మన దేశంలో ప్రతి యేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటూ మన దేశం తరుపున అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించడం గత 52 యేళ్లకు పైగా కొనసాగుతూ వస్తోంది. ఈ యేడాది ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో అఖండ, ఆర్ఆర్ఆర్, బండి, మేజర్, కుదిరామ్ బోస్ వంటి ఐదు తెలుగు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.
దేశ స్వాతంత్య్రం కోసం అతిపిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంఛ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాకపోయినా.. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు మరో తెలుగు చిత్రం ’బండి’ ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. (Twitter/Photo)