Vantalakka - Premi Viswanath: వంటలక్కకు మరో అదిరిపోయే ఆఫర్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కార్తీక దీపం ప్రేమి విశ్వనాథ్ వివరాల్లోకి వెళితే..కార్తీక దీపం వంటలక్క దీప గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. అంతేకాదు ప్రైమ్ టైమ్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా.. కార్తీక దీపం సీరియల్ రేటింగ్‌ను క్రాస్ చేయకపోవడం కార్తీక దీపం స్పెషాలిటీ. . (Instagram/Photo)
కార్తీక దీపం సీరియల్ కొన్ని సందర్భాల్లో మన దేశంలో నంబర్ వన్ ప్రోగ్రామ్‌గా మిగతా అన్ని ప్రోగ్రమ్స్ను క్రాస్ చేయడం అంటే మాములు విషయం కాదు. గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కార్తీక దీపం దూకుడు ఆపే సీరియల్ ఎపుడు వస్తుందో కానీ.. ఇప్పటికైతే.. కార్తీక దీపం సీరియల్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో రేటింగ్ విషయంలో కాస్త వెనకబడింది.vantalakka
ఆ సంగతి పక్కన పెడితే.. కార్తీక దీపం సీరియల్‌తో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ సీరియల్లో వంటలక్క అలియాస్ దీప.. హీరోయిన్స్ మించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ సీరియల్‌తో ఇంత అభిమానం పొందిన నటి ఎవరైనా ఉన్నారంటే.. అంది వంటలక్కే. ఈమె క్రేజ్‌ను బడా హీరోలను సైతం విస్తుపోయేలా చేస్తోంది.premi_vishwanath Instagram
తాజాగా వంటలక్క బాలయ్య చిత్రానికి ఓకే చెప్పినట్టే సమాచారం. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉందట. అది హీరోయిన్ చెల్లెలు పాత్ర అని చెబుతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వంటలక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందట. అందుకే ప్రేమి విశ్వనాథ్‌ను ఆ పాత్ర కోసం సంప్రదించారట.