Vantalakka - Premi Viswanath: వంటలక్కగా ఫేమసైన కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్‌కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్ఠార్ హీరోయిన్స్ కూడా ఈమె క్రేజీ ముందు దిగదుడుపే. టీవీల్లో ఎన్ని తోపు లాంటి సినిమాలొచ్చినా.. కార్తీక దీపం రేటింగ్ ముందు ఎన్నో యేళ్లు నిలవలేకపోయాయి. రీసెంట్గా కార్తిక దీపం సీరియల్‌కు ఎండ్ వేసారు. తాజాగా ఈమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందనే విషయం వైరల్ అవుతోంది.
Premi Viswanath: ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath).. ఈ పేరు తెలుగు చిన్న తెరపై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్నది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ.. మిగిలిన ఏ సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోతున్నారు. . Photo : Instagram
కార్తీక దీపం వంటలక్క అంటే తెలియని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక్క సీరియల్‌తో ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది ఈ మలయాళీ అందం ప్రేమి విశ్వనాథ్. ఈ భామ ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది. రీసెంట్గా కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్ట్ వేశారు. Photo : Instagram
కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్లో ప్రధానంగా అనుమానపు భర్త.. ఓ మంచి అత్త, మరోవైపు భర్త కోసం గోతి కాడ నక్కలా ఎదురు చూసే మరో యువతి.. ఈ అందరి మధ్యలో నలుగుతూ ఉండే దీప పాత్రలో ప్రేమి. ఈ సీరియల్ స్టార్ మాకు పెద్ద దిక్కుగా మారింది. ఆ ఛానల్‌కు కొండంత అడ్డగా నిలుస్తోంది. Photo : Instagram
కార్తీక దీపం సీరియల్ కోసం నల్లగా కనబడడానికి ఈమె ముఖానికి నల్ల రంగు వేసుకుంది. కెమెరా లైటింగ్ ఇతరత్న కారణాల వల్ల హీరోయిన్స్ ఎక్కువగా అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కోవలో ప్రేమి విశ్వనాథ్ ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయట. దాని కోసం ఈమె ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ప్రేమీ విశ్వనాథ్ విషయానికొస్తే.. ఈమెకు ఎంత ఆస్తి ఉండొచ్చనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆమె ఆస్తులు రూ.40 కోట్లు ఉండొచ్చని అంచనా. ఈమె మళయాళంలో వచ్చిన కార్తీక దీపం సీరియల్లో విశేష ప్రజాభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా చేసింది. ఇక ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు. Photo : Instagram
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్లో మోనిత క్యారెక్టర్ కూడా ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఆ సీరియల్’లో ఉండే క్యారెక్టర్స్‌ను ఓ సారి పరిశీలిస్తే.. కార్తిక్‌గా నిరుపమ్ పరిటాల ఆకట్టుకుంటుంటే.. దీప పాత్రలో వచ్చిరాని తెలుగుతో పరవాలేదనిపిస్తోంది ప్రేమి విశ్వనాథ్. Photo : Instagram
అయితే ఈ రెండు పాత్రలతో పాటు మరో ప్రధాన పాత్ర సౌందర్య పాత్ర. ఈ పాత్ర ఎంతో హుందా ఉంటూ.. చక్కని ఆహర్యంతో ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర పవర్ లేడిగా మంచి అత్తగా చేస్తోన్న నటి అర్చన అనంత్. ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ ‘కేరాఫ్ అనసూయ’లో కూడా నటిస్తోంది. ఇందులో కూడా పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది అర్చన అనంత్. Photo : Instagram
అందాల అత్త అర్చన ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిందట మొదట. అయితే ఆ తర్వాత కలిసిరాక నటి అయి ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది. ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ ‘కేరాఫ్ అనసూయ’లో కూడా నటించింది. ఇందులో కూడా పవర్ఫుల్ పాత్ర. అందాల అత్త అర్చన ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిందట మొదట. అయితే ఆ తర్వాత కలిసిరాక నటి అయి ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది. Photo : Instagram