Home » photogallery » movies »

PREMAM BEAUTY ANUPAMA PARAMESWARAN TURNS IN TO ASSISTANT DIRECTOR FOR A MALAYALAM FILM PICS GOES VIRAL SR

అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుపమ..కొత్త అవతారంలో ప్రేమమ్ బ్యూటీ

అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. అది అలా ఉంటే అనుపమ ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా చేస్తోంది. ఈ సినిమాలో 'మహానటి' సినిమా హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. దానికి సంబందించిన ఓ ఫోటోను కూడ అనుపమ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్‌గా మారాయి.