Prema Nagar@50Years : అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన సినిమా ’ప్రేమనగర్’. కే.యస్.ప్రకాష్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు సినిమా ప్రేమ కథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. (Twitter/Photo)
మూలకథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కే.యస్.ప్రకాష్ రావు. సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘స్త్రీ జన్మ’ తర్వాత కే.యస్.ప్రకాష్ రావు ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. అప్పట్లో రూ. 4.5 లక్షలను కేవలం సెట్స్ కోసమే ఖర్చు పెట్టారు రామానాయుడు. అప్పట్లో అదో సంచలనం. ఈ సినిమాతో రామానాయుడు తాడో పేడో తేల్చుకుందాని డిసైడ్ అయి ఈ సినిమాను ఎంతో కసితో నిర్మించారు. (Twitter/Photo)
ముందుగా ఈ సినిమా కథను నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కోడూరు కౌసల్యదేవి నుంచి ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయినా తర్వాత సినిమా తీయాలనే నిర్ణయం విరమించుకున్నారు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి ఈ కథను అక్కినేని ఇచ్చారు. అక్కినేని ఈ కథను తన భార్య అన్నపూర్ణకు ఇచ్చారు. ఆమె చదివి ఈ సినిమా మీకు దేవదాసు అంత పేరు తీసుకొస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఏవో కారణాలతో శ్రీధర్ రెడ్డి ఈ సినిమా తీయలేకపోయారు. ఆ తర్వాత అక్కినేని సలహాతో రామానాయుడు ఈ సినిమా రైట్స్‌ను రూ. 60 వేలు పెట్టి కొన్నారు. అలా ప్రేమనగర్ సినిమాకు అంకురార్పణ జరిగింది. (Twitter/Photo)
ప్రేమనగర్ సినిమాను ఎక్కువగా ఊటీ, మద్రాస్‌లో పిక్చరైజ్ చేశారు. ఈ చిత్రంలో చిన్నప్పటి సత్యనారాయణ పాత్రలో హీరో వెంకటేష్ నటించారు. 34 కేంద్రాల్లో రిలీజైన ఈ సినిమా 31 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 13 కేంద్రాల్లో 100 వంద రోజులు. హైదరాబాద్‌లో షిప్ట్ పద్దతిని సిల్వర్ జూబ్లీ చేసుకుంది. (Twiter/Photo)
‘ప్రేమ నగర్’ సినిమా విడుదలయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు. రెండు వారాలు ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాలేదు. కానీ మూడో వారం నుంచి ప్రేమనగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టింది. ఓవరాల్‌గా రూ. 15 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ. 50 లక్షలు వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతగా రామానాయుడుకు కొత్త ఊపిరి ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో రామానాయుడు గొప్ప చిత్రాలు నిర్మించేందకు ప్రేరణగా నిలిచింది. (Twitter/Photo)
ప్రేమనగర్ సినిమాను హిందీలో అదే టైటిల్ ‘ప్రేమనగర్’గా రీమేక్ చేశారు. అక్కడ రాజేష్ ఖన్నా, హేమా మాలిని నటించారు. తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా వాణిశ్రీ హీరోయిన్గా ‘వసంత మాలిగై’ గా రీమేక్ చేశారు. ఈ రెండు భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో విజయ ప్రొడక్షన్స్‌తో కలిసి విజయా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు.ఈ సినిమాతో రామానాయుడు నిర్మాతగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. (Twitter/Photo)