భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన అప్ డేట్స్ భారీ హైప్ తీసుకొచ్చాయి. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
హై టెక్నాలజీ ఉపయోగించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిత్రంలో రాజమన్నార్ రోల్ లో జగపతిబాబు నటిస్తుండగా.. ఆయన కొడుకు పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారని తెలుస్తోంది. వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ విలనిజం సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందని అంటున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఆధ్య రోల్ లో ఆమె కనిపించనుంది.