పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది షేప్ అవుట్ అవుతుంటారు. కానీ కొంత మంది మాత్రం అటు కుటుంబంతో పాటు తమ ఫిజిక్‌ను కాపాడుకునే పనిలో పడుతుంటారు. తాజాగా ప్రణీత కూడా ఇపుడు గర్భం తర్వాత మళ్లీ జిమ్ బాట పట్టింది. అక్కడ వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తోంది. అంతేకాదు చక్కని గ్లామర్‌తో ఇప్పటికీ అదే సొగసును మెయింటెన్ చేస్తోంది. తాజాగా ఈమె ఓ బడా స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తన పెంపుడు కుక్కుతో దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. (Instagram/Photo)
ప్రణీత సుభాష్ ఏది చేసినా సంచలనమే అని చెప్పాలి. నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎపుడు ముందుంటుంది. ఒక్కొసారి సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు దొరికిపోతుంటుంది. మరొక సారి వాళ్ల అభిమానాన్ని చూరగొంటోంది. ఈమె ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది. (Instagram/PranithaSubhash)
చివరకు పెళ్లి తేదీ నాడు ఆమె మ్యారేజ్ న్యూస్ వైరల్ కావడంతో తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ప్రణీత. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరుగుతోందని, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం, సపోర్ట్ కావాలని ఆమె కోరింది. గత జూన్ 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)
మంచి పాత్రలు వస్తే సినిమాలు చేయడానికీ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది. దీంతో మన హీరోలు తమ సినిమాల్లో ఏదైనా మంచి పాత్రలు ఉంటే ఈమె పేరును సజెస్ట్ చేస్తారేమో చూడాలి. అందుకు తగ్గట్టే ఇపుడు ఎన్టీఆర్ ఈమె పేరును కొరటాల సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఈమె ఎన్టీఆర్‌తో రభస సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)