స్విమ్మింగ్ ఫూల్‌లో సేద తీరుతున్న పవన్ కళ్యాణ్ భామ ప్రణీత సుభాష్..

బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు ఎవ‌రు గుర్తొచ్చే వారో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం ప్ర‌ణీత గుర్తొస్తుంది. ఐదేళ్ల కింద "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మ‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఎందుకో తెలియ‌దు మ‌రి తెలుగులో ఈమె స్టార్ కాలేక‌పోయింది. అప్ప‌ట్లో "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది కానీ స్టార్ మాత్రం కాలేదు. కానీ హాట్ ఫోటోషూట్స్ మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది.