ప్రణీత ఫ్యాన్స్ రీసెంట్గా అభిమానులకు తాను గర్భవతి అన్న శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. భర్తను హగ్ చేసుకొని స్కానింగ్ రిపోర్టును కూడా అభిమానులకు చూపించింది. తన భర్త పుట్టినరోజున తనకు నిజంగా ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పింది ప్రణీత. తాజాగా ప్రణీత సీమంతం జరిగిన ఫోటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Instagram/Photo)
ప్రణీత తన భర్త నితిన్ 34వ పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతిని అన్న గుడ్ న్యూస్‌ను అభిమానులకు చెప్పిన సంగతి తెలిసిందే కదా. తాను తల్లి కాబోతున్న శుభవార్త ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసింది. తాజాగా ప్రణీత కుటుంబ సభ్యులతో కలిసి ప్రణీత సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలను ప్రణీత తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. (Instagram/Photo)
ప్రణీత సుభాష్.. సినిమాల విషయానికొస్తే.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టంలేదు. (Instagram/Photo)