మా అసోసియేషన్లో గత కొన్నేళ్లుగా మెగా కుటుంబం ఏది చెబితే అదే జరిగేది. వాళ్లు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే అధ్యక్షుడిగా గెలిచేవాళ్లు. ఒక్కముక్కలో చెప్పాలంటే చిరంజీవి కను సన్నల్లోనే మా ఎన్నికలు జరిగేవి. ఆయన ఎవరికి అండగా నిలబడితే.. ఆయనెవరి పేరు చెబితే వాళ్లు దాదాపు ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు మెగా సపోర్ట్ అందుకుని ఓడిపోయిన వాళ్లు ఒక్కరు కూడా లేరు.
మెగా సపోర్ట్ ఉండి కూడా ప్రకాష్ రాజ్ ఓడిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చే విషయమే. కానీ అవతలి వైపు ఉన్నది మోహన్ బాబు.. చిరంజీవితో పోటీ పడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ఈయన. పైగా తన కొడుకు నిలబడుతున్నాడని తెలిసిన తర్వాత కూడా నాన్ లోకల్ క్యాండిడేట్కు చిరు సపోర్ట్ చేయడాన్ని మోహన్ బాబు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు.
ప్రతీ ఒక్కరికి ఫోన్ చేయడం దగ్గర్నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందర్నీ ఓటు కోసం ఇక్కడికి తీసుకురావడం వరకు మోహన్ బాబు ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కానీ చిరంజీవి మాత్రం ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదని అర్థమైపోయింది. మొత్తానికి ఇదే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో చిరు సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా నిలబడటానికి క్యాండిడేట్ ఎవరూ సిద్ధంగా ఉండరేమో మరి..?