ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కిస్తున్న హిట్ వెబ్ సిరీస్ 'ఆశ్రమం' సెట్‌ను అక్టోబర్ 24 ఉదయం భోపాల్‌లో ధ్వంసం చేశారు. ఆయన సెట్‌పై దాడి జరిగింది. ఆశ్రమం సిరీస్‌పై ముందు నుంచి కూడా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీన్ని ఆపాలంటూ చాలా రోజుల నుంచి రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ పేరును వ్యతిరేకిస్తూ దర్శకుడు ప్రకాష్ ఝా మొహంపై ఇంక్ కూడా పోసారు బజరంగ్ దళ్ కార్యకర్తలు.

సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటుడు బాబీ డియోల్ కూడా దాడి సమయంలో స్పాట్లోనే ఉన్నారు. షూటింగ్ స్పాట్లో ఎవరికీ గాయాలు కానప్పటికీ.. దుండగులు కొన్ని వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. బజరంగ్ దళ్ ప్రొవిన్షియల్ కన్వీనర్ సుశీల్ ఈ సిరీస్ పేరును ప్రకాష్ ఝా మార్చకపోతే షూటింగ్ కొనసాగించడానికి అనుమతించబోమని హెచ్చరించారు.
ఆశ్రమం అనే పేరు మార్చకపోతే షూటింగ్ అనుమతించబడదు.. ఇది మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ విడుదలకు కూడా అనుమతించబడదు. ఇది మతాన్ని కించపరుస్తోంది.. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలా ఈ వెబ్ సిరీస్ పేరు ఉంది.. ఆశ్రమ సంప్రదాయం మా గుర్తింపు.. ఏదైనా నేరం జరిగితే ఆశ్రమం.. దాని పేరు మీద సినిమా తీయండి.. అంతేకానీ అన్ని ఆశ్రమాలకు ఒకే పేరు పెట్టి పరువు తీయొద్దు అని తెలిపారు.
అన్ని ఆశ్రమాలకు దాన్ని ఆపాదించొద్దు.. అనవసరంగా మా పరువు తీయవద్దు అని సుశీల్ తెలిపారు. మేము ప్రకాష్ ఝా ముఖాన్ని ఇంక్ పోసి మా నిరసన తెలియజేసామని చెప్పారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. అలాగే దేశభక్తి సినిమాల్లో పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు, బిజేపీ ఎంపి సన్నీ డియోల్ నుంచి తమ్ముడు బాబీ డియోల్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నామని తెలిపారు.