హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులందరినీ మెప్పించారు. ఇప్పుడు సరికొత్తగా ‘మై డియర్ భూతం’ అంటూ రాబోతోన్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మై డియర్ భూతం ఈ జూలై 15వ తేదీన విడుదలకానుంది. ఈ క్రమంలోనే ప్రభుదేవా మీడియాతో ముచ్చటించారు. (Twitter/Photo)
మై డియర్ భూతం సినిమాను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇదొక భూతం సినిమా. ఈ కారెక్టర్ కొత్తది. ఓ రెఫరెన్స్ అంటూ ఏమీ లేదు. మనమే సృష్టించి చేయాలి. అయితే క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్‌గా అనిపించింది. సీజీ వర్క్ ఎక్కువగా ఉంది కరెక్ట్‌గా చేస్తారా? అని దర్శకుడిని అడిగాను. చేస్తాను అని అన్నారు. నేను ఆయన్ను నమ్మాను. (Twitter/Photo)
దర్శకుడితో మీ రిలేషన్ ఎలా ఉండేది? నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు యాక్టర్‌గానే ఉండేవాడిని. దర్శకుడికి ఎలాంటి సలహాలు ఇచ్చేవాడిని కాదు. చాలా అరుదుగా సలహాలు ఇస్తుంటాను. ఆయన ఇది వరకు రెండు సినిమాలు చేశారు. ఆయన చాలా మంచి వారు. అందుకే ఈ చిత్రాన్ని చేశాను. ఈ చిత్రాన్ని 45రోజుల్లో చేశాం. కానీ సీజీ వర్క్‌కు మాత్రం 11 నెలల సమయం పట్టింది. (Twitter/Photo)
ఈ సినిమా సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? భూతం అనే పాత్రే కొత్తది. అది ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే రెఫరెన్స్‌లు ఉండేవి కాదు. నేనే ఊహించుకుని చేసే వాడిని. వాటిని దర్శకుడు కూడా ఓకే అనేవారు. ఇందులో నేను, ఒక అబ్బాయి, అతని తల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. నేను ఇంకా ఈ సినిమాను చూడలేదు. నేను తప్పా అందరూ చూసేశారు. నేను తెలుగుకు డబ్బింగ్ చెప్పలేదు. నా తెలుగు ఇలా ఉంటుంది (నవ్వులు). ఇక నా గెటప్ చూసి అందరూ వింతగా చూసేవారు. అందరూ నవ్వుకునే వారు. ఇంట్లో అద్దంలో నాది నేను చూసుకుని ‘ఏంట్రా ఇలా అయిపోయింద’ని అనుకునేవాడిని . సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హారర్ కాన్సెప్ట్ ఉండదు. (Twitter/Photo)