Prabhas: సలార్ భారీ డీల్.. అంచనాలకు రెక్కలు కడుతున్న డిమాండ్!
Prabhas: సలార్ భారీ డీల్.. అంచనాలకు రెక్కలు కడుతున్న డిమాండ్!
Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ గురించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా హక్కులకు సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ సలార్ (Salaar) గురించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
2/ 8
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో భారీ ఎత్తున ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes)తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై యావత్ భారతదేశంలోని ఆడియన్స్‌లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.
3/ 8
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో భారీ ఎత్తున ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes)తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై యావత్ భారతదేశంలోని ఆడియన్స్‌లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.
4/ 8
ఈ నేపథ్యంలో తాజాగా సలార్ ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్లు కొన్ని వార్తలు బయటకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. భారీ ధర చెల్లించి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిలిం సంస్థ కొనుగోలు చేసినట్లు టాక్. ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
5/ 8
విడుదలకు ముందే సలార్ సినిమాపై ఏర్పడిన అంచనాలతో ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఈ మేరకు సలార్ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడిందట. శాలిలైట్ హక్కుల విషయంలో కూడా పలు సంస్థలు పోటీ పడినట్లు సమాచారం.
6/ 8
సలార్ కోసం తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్స్ షూట్ చేశారట ప్రశాంత్ నీల్. ఫిలిం నగర్లో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబో చిరకాలం గుర్తుండేలా ఈ చిత్రంలోని సీన్స్ ఉండనున్నాయట.
7/ 8
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున ఈ సలార్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ (Prithwiraj sukumaran), ఈశ్వరీరావు (Eeswari Rao) కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ (Ravi Basrur) బాణీలు కడుతున్నారు.
8/ 8
హై టెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా చూపించబోయే కొన్ని సీన్స్ ఈ సినిమాకు ప్రాణం కానున్నాయని సమాచారం. ఇకపోతే ఈ భారీ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ అయితే పీక్స్‌లో ఉండనుందని టాక్. ఈ భారీ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు.