ఆదిపురుష్తో పాటు.. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే వంటి బిగ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆదిపురుష్ విడుదల తేదీ వాయిదా పడింది. ఆదిపురుష్ గత కొన్నిరోజులుగా వాయిదా పడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఈ వార్తలపై ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ స్పందించారు. ఆదిపురుష్ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ఆయన పర్యటించారు.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో సలార్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో యావత్ భారతదేశంలోని ఆడియన్స్లో ఒకరమైన క్యూరియాసిటీ నెలకొంది. సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. Prabhas Twitter