ప్రభాస్,రాజమౌళి సహా అక్టోబర్‌లో పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..
ప్రభాస్,రాజమౌళి సహా అక్టోబర్‌లో పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..
బాహుబలి సినిమాతో అటు హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు రాజమౌళికి దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ప్రభాస్, రాజమౌళి కెరీర్ కచ్చితంగా బాహుబలికి ముందు తర్వాత అని విడదీయాలి. ఎందుకంటే దానికంటే ముందు కేవలం తెలుగు వాళ్లే. వీళ్లిద్దరి పుట్టినరోజు అక్టోబర్ నెలలోనే ఉంది. వీళ్లతో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు అక్టోబర్ నెలలోనే పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.
బాహుబలి సినిమాతో అటు హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు రాజమౌళికి దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ప్రభాస్, రాజమౌళి కెరీర్ కచ్చితంగా బాహుబలికి ముందు తర్వాత అని విడదీయాలి. ఎందుకంటే దానికంటే ముందు కేవలం తెలుగు వాళ్లే. (Twitter/Photo)
2/ 13
ఇపుడు ఇప్పుడు ప్యాన్ ఇండియా సెలబ్రిటీలు. హీరోగా ప్రభాస్.. ప్యాన్ ఇండియా హీరో అయితే.. రాజమౌళి ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (Twitter/Photo)
3/ 13
అక్టోబర్ 23న ప్రభాస్ 41వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. ఈ బర్త్ డే రోజున అభిమానులకు తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు తను చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. (Instagram/Prabhas)
4/ 13
దాంతో పాటు తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలున్నాయి. (Instagram/Prabhas)
5/ 13
అక్టోబర్ 13న పూజా హెగ్డే తన 30వ పుట్టినరోజు జరుపుకోబోతుంది. ఈ రోజు ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఏదైనా అప్డేట్ సినిమా యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది. (Twitter/Photo)
6/ 13
ఈ నెల 10న రాజమౌళి పుట్టినరోజు. ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. (Twitter/Photo)
7/ 13
రకుల్ ప్రీత్ సింగ్ Wఈ నెల 10న తన 30వ ఏట అడుగుపెట్టనుంది. గత కొన్నేళ్లుగా నెంబర్ వన్ హీరోయిన్ రేసులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇపుడు హిట్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఏమైనా ఈ బర్త్ డే రోజున ఏదైనా సర్ఫ్రైజ్ ఉండే అవకాశం ఉంది. (Rakul Preet Singh/Instagram)
8/ 13
అక్టబర్ 9న మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పుట్టినరోజు. ఈ రోజు చిరంజీవితో పాటు బాలకృష్ణతో చేయబోయే సినిమాలకు సంబంధించిన ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
9/ 13
అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. ఈ రోజు తన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటరే’ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (sai dharam tej)
10/ 13
అక్టోబర్ 8న దర్శకుడు మారుతి పుట్టినరోజు. ఈ రోజు తన సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ప్రకటించే అవకాశం ఉంది. (Director Maruthi)
11/ 13
8 అక్టోబర్ 1977లో జన్మించిన మంచు లక్ష్మి ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తాను నటించబోయే వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (Twitter/Photo)
12/ 13
అక్టోబర్ 29న మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈ రోజు మెగాభినులకు ఏదైనా స్పెషల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (Twitter/Photo)
13/ 13
అక్టోబర్ 9న దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లులు ఎస్పీ శైలజ పుట్టినరోజు. (Twitter/Photo)