రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. పూజ ాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరో ముఖ్యపాత్రలో అలరించారు. రెండేళ్ల లాంగ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన ప్రభాస్ ఈ సినిమాతో అందుకోవాల్సిన రికార్డులు టాస్క్‌లు భారీగా ఉన్నాయి. (File/Photo)
ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఇక రాధే శ్యామ్’ మూవీ రాయలసీమ సీడెడ్‌లో రామ్ చరణ్, బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ డే రూ. 7.14 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డును రాధే శ్యామ్ బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. Pooja hegde Instagram
పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి. మొత్తంగా అక్కడ ఈ సినిమాను రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిందీ రీజియన్‌లో బాహుబలి 2 రికార్డ్స్ అందుకోవడం కష్టం. కానీ సాహో సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 24.4 కోట్ల షేర్‌ను అందుకుంటుందా అనేది చూడాలి. (Twitter/Photo)
కేరళలో నాన్ బాహుబలి సినిమాల్లో ‘సాహో’ మూవీ రూ. 1.2 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో నాన్ బాహుబలి మూవీస్‌లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా 1.5 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. ఈ రికార్డులను ‘రాధే శ్యామ్’ ఫస్ట్ డే క్రాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా ‘రాధే శ్యామ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అందరి కళ్లు ఉన్నాయి. మరి ఈ రికార్డ్స్‌లో ప్రభాస్ ఎన్ని క్రాస్ చేస్తాడా అనేది చూడాలి. (Twitter/Photo)
తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో దాదాపు 1800 థియేటర్స్‌లో విడుదల కానుంది రాధే శ్యామ్. అంటే ఉన్న థియేటర్స్‌లో దాదాపు 85 శాతం ఇదే ఉండబోతుందన్నమాట.ఏపీలో టికెట్ రేట్లు కూడా ఓ కొలిక్కి రావడంతో కచ్చితంగా రికార్డు ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి.
కర్ణాటక: రూ. 12.50 కోట్లు తమిళనాడు: రూ. 6 కోట్లు కేరళ: రూ. 2.10 కోట్లు హిందీ: రూ. 50 కోట్లు రెస్టాఫ్ ఇండియా: రూ. 3 కోట్లు ఓవర్సీస్ : రూ. 24 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 204 కోట్ల రాబట్టాలి. (Twitter/Photo)
ఇక ఈ సినిమాలో విజువల్ వండర్ అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్ర యువకుడి పాత్రలో నటించారు.