ప్రభాస్ సినిమాలకు ఇప్పుడున్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాంటిక్ జోనర్లో సినిమా చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత రాధే శ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.
ఈ మధ్యే హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులతోనే ట్రైలర్ లాంఛ్ చేయించారు దర్శక నిర్మాతలు. విక్రమాదిత్య అంటే ఎవరు అంటూ ఆ మధ్య పోస్టర్‌పై రాసుకొచ్చారు. టీజర్లో దీనికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మరింత క్లారిటీ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్లో ప్రభాస్ కారెక్టరైజేషన్ అదిరిపోయింది. దీనికి మంచి మార్కులు పడుతున్నాయి.
ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. కళ్లలో ఏదో తెలియని కంగారు కూడా కనిపిస్తుంది. మొత్తంగా పోస్టర్స్ చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తున్నాయి. బాగా లోతుగా అర్థం కనిపిస్తుంది. విడుదలైన క్షణం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ ట్రైలర్. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఒక్కో పోస్టర్, టీజర్, ట్రైలర్ విడుదలవుతున్న సమయంలో వాటికి వస్తున్న స్పందన చూస్తుంటే.. మేకర్స్‌పై మరింత భాద్యత పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్‌ను కూడా మనస్పూర్థిగా ఆహ్వానించారు ఫ్యాన్స్. ప్రతీ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ అందించారు. తాజాగా ట్రైలర్ అయితే ఏకంగా టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తుంది.
ఈ ట్రైలర్లో డైలాగ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. భిన్నమైన భాషల్లో సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. కొన్ని రోజులుగా విడుదలవుతున్న ఈ సినిమా లుక్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు వాళ్లను తెరపై చూస్తామా అని అభిమానులు వేచి చూస్తున్నారు. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది.
తెలుగుతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో రాధే శ్యామ్ విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డాక్టర్ యువీ కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యంగా హిందీలోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్కడ భారీ బిజినెస్ చేస్తుంది రాధే శ్యామ్.