ప్రభాస్ సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ఈయన తన స్థాయి పెంచుకుంటున్నాడు. తెలుగు హీరోగానే ఉండిపోవాలని అస్సలు అనుకోవడం లేదు ప్రభాస్. అందుకే ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు.. అవి జరుపుకుంటున్న బిజినెస్ అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉన్నాయి.
ఇప్పట్లో ప్రభాస్ రేంజ్ ముట్టుకోవడం కూడా కష్టమే. సినిమాకు 100 కోట్ల పారితోషికం అందుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ఈయన. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా ఈయన తన రాధే శ్యామ్ సినిమా విషయంలో సల్మాన్ ఖాన్ రూట్ ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.