దర్శకుడు మారుతి విషయానికొస్తే.. ఈయన గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్ కాలేదు. థియేట్రికల్‌గా ఈ సినిమా లాస్ తీసుకొచ్చింది. మరోవైపు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రూపంలో తీసుకుంటే పక్కా కమర్షియల్ ప్రాజెక్ట్ సేఫ్ అయింది. ఈ సినిమా ఫలితంతో ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా అసలు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. (Twitter/Photo)
ఈ మధ్య కాలంలో వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసాడు. ప్రస్తుతం 22వ సినిమా చేస్తున్న ప్రభాస్.. అప్పుడే 25వ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసాడు. మైల్ స్టోన్ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. ఇదిలా ఉండగానే తాజాగా మారుతి సినిమాకు సైన్ చేసాడు ప్రభాస్. కొన్నేళ్లుగా కేవలం యాక్షన్ డ్రామాలతోనే ప్రయాణం చేస్తున్న ప్రభాస్.. చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. నిజానికి మిర్చి నుంచి వరసగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్.Photo Twitter
ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా మరే స్టార్ హీరో కూడా లేడు. ఒకేసారి అరడజన్ సినిమాలు కన్ఫర్మ్ చేసాడు ఈయన. అన్నీ షూటింగ్ జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా రాబోయే మూడేళ్లలోనే విడుదల చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. (Prabhas , Maruthi Photo : Twitter)
ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు ఈయన. అదే మారుతి సినిమా. ఈ మధ్య కాలంలో వరసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. (Twitter/Photo)
ఈ సినిమాకు ప్రభాస్ కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని.. వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను రూ. 50 కోట్ల బడ్జెట్లోనే పూర్తి చేసేలా ఉన్నారు వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది.
ఆరు నెలల్లో సినిమా విడుదల చేయాలని మారుతి కూడా గట్టి ప్లాన్ వేసుకుంటున్నాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో ప్రభాస్ చేసిన కామెడీ సూపర్‌గా వర్కవుట్ అయింది. కానీ సినిమాలే హిట్ అవ్వలేదు. కానీ మారుతి సినిమాతో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు రెబల్ స్టార్. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా స్పిరిట్ సినిమాలు త్వరలోనే మొదలు పెట్టనున్నాడు ప్రభాస్.
ఆరు నెలల్లో సినిమా విడుదల చేయాలని మారుతి కూడా గట్టి ప్లాన్ వేసుకుంటున్నాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో ప్రభాస్ చేసిన కామెడీ సూపర్‌గా వర్కవుట్ అయింది. కానీ సినిమాలే హిట్ అవ్వలేదు. కానీ మారుతి సినిమాతో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు రెబల్ స్టార్. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సినిమా సగం కంప్లీట్ అయింది. ఇక సందీప్ వంగా స్పిరిట్ సినిమా త్వరలోనే మొదలు పెట్టనున్నాడు ప్రభాస్.