Prabhas - Kriti Sanon: రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ కోవలో ఈయన ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈమెతో షూటింగ్లో ఉండగానే ప్రభాస్ ప్రేమలో పడ్డట్టు వార్తలు రావడమే కాదు.. మాల్దీవ్స్‌లో వీళ్లు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభాస్ అండ్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా కృతి సనన్‌తో ప్రభాస్ నిశ్చితార్ధం విషయమై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఏది నమ్మాలో ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టమయిపోయింది. అందరి దృష్టిలో ఉండే సినీతారలపై అలాంటి పుకార్లు ఎన్నో పుట్టుకు వస్తూనే ఉన్నాయి.. చివరికి, అలా వచ్చిన వార్తలలో అసలు నిజం ఏమిటో స్వయంగా ఆ నటీనటులే స్పష్టం చేయాల్సొస్తుంది. (Twitter/Photo)
సరిగ్గా అలంటి పరిస్థితిలోనే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటి కృతి సనన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ కి తనకి మధ్యన వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని మరే ఇతర వార్తలని నమ్మవద్దని చెప్ఫింది. తాజాగా వారిద్దరికీ త్వరలోనే ఎంగేజిమెంట్ జరగనున్నట్టు పుకార్లు మొదలయ్యాయి. మాల్దీవ్స్‌లో వీళ్లు నిశ్చితార్ధపు ఉంగరాలు కూడా మార్చుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. (Twitter/Photo)
‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ - రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, వాత్సల్ శేత్ ఇంద్రజిత్తుడిగా, దేవదత్త నాగే హనుమాన్ గా కనిపించనున్నారు. ఈ చిత్ర విడుదలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తుండగా జూన్ 16, 2023 న విడుదల చేస్తున్నారు. (Twitter/Photo)
ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ ఈ యేడాది దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘రాజాడీలక్స్’ మూవీ చేయనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ K 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాతో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. (Twitter/Photo)