బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు చిత్ర కథ ఎలా ఫుట్టిందనే విషయాలను పంచుకున్నారు. (Twitter/Photo)
‘రాధే శ్యామ్’ సినిమా కథ ఎలా పుట్టిందో చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. సినిమా చేయడానికి నాలుగేళ్లు సమయం పట్టిందన్నారు. ఈ కథ రాసుకోవడానికి 18 యేళ్లు పట్టిందన్నారు. మొట్ట మొదటిసారి ఈ పాయింట్‌ను నా గురువైన చంద్రశేఖర్ యేలేటి దగ్గర విన్నాను. దేశంలోని పెద్ద పెద్ద రైటర్స్‌ను పిలపించి రాయించాం. . కానీ, కథకు ఒక ముగింపు దొరకలేదు. ఆ సమయంలో యేలేటి గారు ఒకమాట అన్నారు. ‘ఈ కథ జాతకాల మీద చేస్తున్నావు. ఎవరికి ఈ కథ రాసి పెట్టి ఉందో అన్నారు. చివరకు ఈ కథ ప్రభాస్ దగ్గరకు చేరిందన్నారు. (Twitter/Photo)
ఈ కథ ప్రభాస్ గారికి రాసిపెట్టి ఉంది. ఆయన ఓకే చేయకపోయి ఉంటే ఈ కథ తెరకెక్కే సాహసం ఏ హీరో చేసేవారే కాదన్నారు. ఇక ఈ కథకు సంబంధించిన పాయింట్ మా గురువు దగ్గర తీసుకొని ఒక ఫిలాసఫీని లవ్ స్టోరీగా చేసి, కథ రాసి ఆయనకు చెప్పాను. ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం ఉండవు. ఒక అమ్మాయికి అబ్బాయికీ మధ్య జరిగేయుద్ధాలే ఉంటాయి. అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్త సముద్రాలు దాటుకుంటూ ఎలా వెళ్లాడనదే ‘రాధా శ్యామ్’ స్టోరీ. (Twitter/Photo)
కేవలం ఈ సినిమా ట్రైలర్ చూసి ఓ అంచనాకు రావద్దన్నారు. సినిమాటోగ్రఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా విజువలైజ్ చేసి చూపించరన్నారు. నిర్మాతలైన ప్రమోద్, వంశీ, విక్కీ లేకపోతే ఈ సినిమానే లేదన్నారు. ప్రభాస్ కథను నమ్మి ఎంతో రిస్క్ చేశారు.మీలాంటి వాళ్లు ఉండటం వల్లే నా లాంటి దర్శకులు ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నారన్నారు దర్శకుడు రాధా కృష్ణ కుమార్. (Twitter/Photo)
మరోవైపు దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే.. అద్భుతమైన ప్రేమకథగా కనిపిస్తోంది. నేను తెరకెక్కించే చిత్రంలో దీపికా, అమితాబ్ తెలుగులో మాట్లాడితే.. ప్రభాస్ హిందీలో మాట్లాడరన్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ హిందీతో పాటు తమిళం, కన్నడలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. (Twitter/Photo)
‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెరపై ఇద్దరు రెబల్ స్టార్స్‌ను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)
‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వివిధ పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తో పాటు ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ అశ్విన్ అతిథులుగా విచ్చేసారు. నిర్మాత దిల్ రాజు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, ఆయన పెద్దమ్మ గారు సైతం వేడుకకు హాజరై అభిమానులను అభివాదం చేశారు. . ఇక ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ గ్రాండ్ వేదిక సాక్షిగా విడుదల చేశారు. రష్మీతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్స్ గా ఈవెంట్ లో జోష్ నింపారు. ముఖ్యంగా నవీన్ తన ఎనర్జీ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. (Twitter/Photo)