ఈ క్రమంలో ఈ క్యారెక్టర్ కోసం యష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే... బ్రహ్మాస్త్ర 2లో యష్కి దేవ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అదే విధంగా కర్ణ సినిమా నుంచి కూడా నటుడికి ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు యష్ తర్వాత మరో సౌత్ స్టార్ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనెవరో కాదు.. బాహుబలి స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్.
ఇప్పటి వరకు హృతిక్, షారూక్, సల్మాన్ ఖాన్ , యష్ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం డైరెక్టర్ అయాన్ ప్రభాస్ ని కూడా సంప్రదించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్. ఇది ఊహాగానాలే అయినప్పటికీ, ఈ వార్త అంతటా బాగానే వ్యాపించింది. ప్రభాస్ బ్రహ్మస్త్ర2లో కనిపిస్తాడని అంతా చర్చించుకుంటున్నారు.