ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో మరో సినిమాలో భాగమవుతున్నారు.