తొలుత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. బాహుబలి సినిమాతో సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు చెప్పుకున్నారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహబంధం మాత్రమే అని ఈ ఇద్దరూ చెప్పడంతో ట్రాక్ మరో వైపు మళ్లింది.