ఈరోజు తాను ఇక్కడ ఉన్నాను అంటే అది ఆయన వల్లే.. తాను ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటానన్నారు ప్రభాస్. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్‌ని ప్రారంభించి, లేడి ఓరియెంటెడ్ సినిమాలు తీసి టాలీవుడ్ లో తన పెదనాన్న కృష్ణంరాజు చరిత్ర సృష్టించారన్నారు. ఈరోజు మా కుటుంబం అంతా ఆయన్ను చాలా మిస్సవుతున్నారు” అని కంటతడి పెట్టుకున్నాడు ప్రభాస్.
[caption id="attachment_1435916" align="alignnone" width="1000"] కృష్ణంరాజు మృతి గురించి ప్రభాస్ మాట్లాడుతూ..” ఆయన నెల రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గరే నేను ఉన్నాను.. నిరంతరం వైద్యులతో టచ్ లో ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య సైతం కృష్ణంరాజును గుర్తుచేసుకున్నారు. ” నేను టర్కీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ వార్త తెల్సింది.. నేను కృష్ణంరాజును తలుచుకొని ఎంతో ఏడ్చాను అంటూ బాలయ్య పేర్కొన్నారు.
స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఆయన సొంతూరు కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా నిర్వహించారు ప్రభాస్. దాదాపు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశాడు ప్రభాస్.అన్నిరకాల నాన్ వెజ్ వంటకాలు పెట్టించాడు. కృష్ణంరాజు స్మృతిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కృష్ణంరాజు మైనపు విగ్రహం రూపుదిద్దుకుంది.