Prabhas | Balakrishna: తాజాగా అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసి ఈ ఎపిసోడ్ పై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది ఆహా టీం. కొద్ది సేపటి క్రితమే వదిలిన ఈ వీడియోలో బాలకృష్ణతో ప్రభాస్ ముచ్చట్లు తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.
బుల్లితెరపై హవా నడిపిస్తున్న నందమూరి బాలకృష్ణ.. సినీ, రాజకీయ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ అన్ లిమిటెడ్ వినోదం పంచుతున్నారు. అన్‌స్టాపబుల్ అంటూ అన్లిమిటెడ్ ఫన్ క్రియేట్ చేస్తూ కాసుల పంట పండిస్తున్నారు.
2/ 10
అన్‌స్టాపబుల్ వేదికగా ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెడుతున్న బాలయ్య బాబు.. తాజాగా ప్రభాస్ తో సీక్రెట్స్ చెప్పిస్తున్నారు. ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా లేటెస్ట్ ఎపిసోడ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.
3/ 10
ఈ ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' అంటోంది. దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో భాగం అతిత్వరలో షురూ కానుంది.
4/ 10
అయితే తాజాగా ఈ రెండో భాగానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసి ఈ ఎపిసోడ్ పై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది ఆహా టీం. కొద్ది సేపటి క్రితమే వదిలిన ఈ వీడియోలో బాలకృష్ణతో ప్రభాస్ ముచ్చట్లు తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.
5/ 10
బాలయ్య బాబు హుషారైన పంచులు ప్రభాస్ సరదా సమాధానాలు ఈ వీడియోలో చూడొచ్చు. ఇందులో భాగంగా మరోసారి హీరోయిన్ల విషయంలో ప్రభాస్ కి ఇరికించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. షాపింగ్ మ్యాటర్ తీస్తూ మెల్లగా కూపీ లాగిన ఈ సీన్ ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయింది.
6/ 10
తమన్నా, నయనతార.. ఈ ఇద్దరిలో ఎవరిని షాపింగ్ తీసుకుపోతావు అని ప్రభాస్ ని బాలయ్య అడిగారు. దీనిపై ఏ మాత్రం తడుముకోకుండా ఇద్దరినీ తీసుకుపోతా అనేశారు ప్రభాస్. దీంతో రెబల్ స్టార్ నారీ నారీ నడుమ మురారి అంటూ సీన్‌ని చమత్కరించారు బాలకృష్ణ.
7/ 10
మీరు చూసింది కూసింత.. చుడాల్సింది కొండంత అంటూ ఈ వీడియో ప్రోమో వదిలారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ హుషారు చూసి ఫిదా అవుతున్నారు ఆయన ఫ్యాన్స్.
8/ 10
బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ హ్యూజ్ రెస్పాన్స్ తో ఆన్లైన్ రికార్డులు తిరగరాస్తోంది. ప్రతి ఎపిసోడ్ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ రీసెంట్ గా ప్రభాస్ ఎపిసోడ్ వదిలారు. ప్రభాస్ ఎపిసోడ్ పై జనాల్లో ఉన్న క్యూరియాసిటీ ఆహా వేదికను స్ట్రక్ చేయడం చెప్పుకోదగిన విషయం.
9/ 10
ఒక్కసారిగా యూజర్స్ రావడంతో ఆహా స్టాప్ అయింది. అయితే కొంత సమయం తర్వాత టెక్నీకల్ ఇష్యూ క్లియర్ చేసి స్ట్రీమింగ్ అందించింది ఆహా టీం. ఈ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.
10/ 10
వెండితెరపై దడదడలాడిస్తున్న నందమూరి బాలకృష్ణ.. బుల్లితెరపై కూడా హవా నడిపిస్తున్నారు. అన్‌స్టాపబుల్ రెండో సీజన్.. తొలి సీజన్ ని మించి రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.