2022లో కొందరు హీరోలు పండగ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు నానా తంటాలు పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిట్ అవుతున్నారు. అన్నీ ఒకసారి సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మంది హీరోలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. కొందరు హీరోలు అయితే ఏకంగా 5 సినిమాలు చేస్తున్నారు.
చిరంజీవి, ప్రభాస్ నుంచి పవన్, రామ్ చరణ్ వరకు చాలా మంది హీరోలు ఒకేసారి రెండు అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడూ ఒక సినిమా మాత్రమే చేస్తాడని పేరున్న కూడా ఒకేసారి నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నాడు. పగలు ఓ సినిమా.. రాత్రి మరో సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు. అలా టాలీవుడ్లో మల్టిపుల్ సినిమాలు చేస్తున్న హీరోలెవరో చూద్దాం..