ఈ సినిమాను కేవలం నాలుగున్నర నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేశాం. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ అయ్యింది. టీమ్ అంతా ప్యాషన్ తో వర్క్ చేశాం. ది బెస్ట్ క్వాలిటీతో వరల్డ్ వైడ్ గా ఈ నెల 23న బిల్లా రిలీజ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయండన్నారు. (Twitter/Photo)
హాస్య నటుడు అలీ మాట్లాడుతూ...ఈ బిల్లా సినిమాలో నేను నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణంరాజు గారితో ఎక్కువ టైమ్ గడిపే అవకాశం దొరికింది. ఆయన వేసే జోకులకు బాగా నవ్వుకునేవాడిని. అర్థరాత్రి బిర్యానీ తెప్పించేవారు. హీరోలకు ఆ అవకాశం లేదురా మనం తిందాం అనేవారు సరదాగా. కృష్ణంరాజు గారు గొప్ప మనిషి. ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. అన్నారు. (Twitter/Photo)
సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ...ఈ సినిమా సంగీతం సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందే. బిల్లా వంద రోజుల తర్వాత తమిళంలో హీరో విజయ్ తో ఓ సినిమా చేసేందుకు వెళ్లాను. కథ విన్నాక మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడని అడిగితే మీ బిల్లా పాటలన్నీ మాకు ఇచ్చేయండి ఈ సినిమాలో పెట్టుకుంటాం. అన్నారు. బిల్లా పాటల క్రేజ్ అలాంటిది. ఈ సినిమా మళ్లీ విడుదలవడం సంతోషంగా ఉందన్నారు. (Twitter/Photo)
ప్రసీధ మాట్లాడుతూ...బిల్లా సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్ లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ ఈ మూవీ. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. నాన్నకు ఈ చిత్రాన్ని మళ్లీ అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే- ఇండియా డయోబెటిక్ ఫుట్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్న కృష్ణంరాజు గారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. మేము ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తాం. (Twitter/Photo)
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...ప్రభాస్ గారి ఇమేజ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇలాంటి సమయంలో వరల్డ్ వైడ్ గా బిల్లా చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణంరాజు గారి కీర్తి ప్రతిష్టల్ని ప్రభాస్, ప్రసీధ ఆయన ఇతర కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నారు.(Twitter/Photo)