ఈ సినిమా షూటింగ్ చేస్తూనే బిగ్గెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చింది చిత్రయూనిట్. ఇటీవల రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ప్రభాస్.. తదుపరి సినిమాతో ఆ లోటు భర్తీ చేసి రెబల్ స్టార్ (Rebal Star) అభిమానులను హుషారెత్తించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆదిపురుష్ సినిమాతో అది తీరుతుందని అంతా భావిస్తున్నారు.
ఈ ఆదిపురుష్ సినిమాను 3D ఫార్మాట్ లో కూడా విడుదల చేయనుండటం విశేషం. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో గ్రాండ్ గా ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. హై టెక్నాలజీ ఉపయోగించి అబ్బురపరిచే వీఎఫ్ఎక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. సినీ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్ మేరకు ఈ చిత్రానికి 3 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.