టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాను ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 'సాహో', 'రాధేశ్యామ్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ 'ఆదిపురుష్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. (Photo Twitter)
. ఈ సినిమాలో రాముడి పాత్రతోపాటు.. రావణుడు.. హనుమంతుడు పాత్రల గెటప్స్ పై ప్రేక్షకులు మండిపడ్డారు. దీంతో నెట్టింట దారుణంగా ట్రోలింగ్స్ నడిచాయి. అంతేకాకుండా.. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ మూవీలో రాముడు.. రావణుడి పాత్రలు పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. దీంతో మరోసారి ఓంరౌత్ ఆదిపురుష్ గ్రాఫిక్స్ రి ఎడిటింగ్ పనులు చేపట్టారు. Adipurush (Photo Twitter)
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసి 2024 ప్రారంభంలోనే రిలీజ్ చేయాలిన మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ను పూర్తిగా మార్చాలని ఆదిపురుష్ టీం నిర్ణయించుకుంది తెలుస్తుంది.