Rebel Star Prabhas | ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్‌తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలను స్టార్ట్ చేసారు. దాంతో పాటు మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టారు. త్వరలో తన 25వ సినిమాను ప్రకటించనున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ .. సలార్‌తో పాటు.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ వంటి సినిమాలను లైన్లో పెట్టారు. మరోవైపు ప్రభాస్.. బాలీవుడ్లో యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్ధ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగాతో పాటు మరో లేడీ దర్శకురాలికి చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
రెబల్ స్టార్ ప్రభాస్ ఓకే చేసిన చిత్రాల్లో ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా ఒకటి. భారీ క్యాస్టింగ్తోపాటు కొత్త నటీనటులతో ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని సింగరేణిలో ప్రారంభించారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా 2022 దసరాకు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. (Twitter/Photo)
ప్రభాస్, నాగ్ అశ్విన్: మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. సోషియా ఫాంటసీగా ఈ కథ రాబోతుంది. ఈ చిత్రాన్ని టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ప్రాజెక్ట్ K టైటిల్‌తో తెరకెక్కుతోంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. (Twitter/Photo)
ఓం రౌత్ దర్శకత్వంలో చేయబోయే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్.. శ్రీరాముడుగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కృష్ణంరాజు దశరథుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సినిమాను 11 ఆగష్టు 2022లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Photo : Twitter)