మెగాస్టార్ హీరోగా వస్తున్న ‘సైరా’ సినిమాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘సైరా’ టీజర్ కి కొద్ది రోజులనాడే శ్రీ పవన్ కల్యాణ్ గారు వాయిస్ ఓవర్ చెప్పారు. తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగంతో స్వరం వినిపిస్తుంటే అన్నయ్య శ్రీ చిరంజీవి గారు పక్కనే ఉన్నారు.
బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి వెండి తెర రూపం ఈ చిత్రం.
చారిత్రక వీరుడి ఘనతను పరిచయం చేసే వ్యాఖ్యల్లో మనం పవన్ కల్యాణ్ గొంతు వినబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా’ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు
అన్నయ్య, తమ్ముడు కలిసి వెండి తెరపై కొద్ది క్షణాలపాటు కనిపించిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. చిత్రాన్ని ప్రేక్షకులు మరచిపోలేదు.
అన్నయ్య నటించిన 151వ చిత్రానికి తమ్ముడు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పడం ప్రేక్షక లోకాన్ని కథలోకి తీసుకువెళ్తుంది.