పవన్ యాక్ట్ చేసిన రీమేక్ సిన్మాలను ఓ సారి చూస్తే...కథ మాత్రమే తీసుకుని...ఆ స్టోరిలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి హిట్లు అందుకున్నాడు. అందుకు ఉదాహరణ హిందీలో సూపర్ హిట్టైనా ‘‘దబాంగ్’’ మూవీని హరీష్ శంకర్ డైరెక్షన్లో మన ఆఢియన్స్కు నచ్చేటట్టు కొన్ని మార్పులు చేసి అందులో అంత్యాక్షరి ఎపిసోడ్ పెట్టి తెలుగులో పవన్ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్‌తో కెవ్వుకేక పుట్టించింది.(Facebook/Photo)
పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ స్టోరి కూడా హిందీలో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్’’ మూవీని దర్శకుడు ఇవివి సత్యనారాయణ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. (Facebook/Photo)