ముఖ్యంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ పలికిన హావ భావాలు.. సిద్దు.. సిద్ధార్ధ్ రాయ్ అంటూ చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విలన్‌ను ఉద్దేశిస్తూ.. నువ్వు గుడుంబా శంకర్ అయితే ఏంటి.. ? తొక్కలో శంకర్ అయితే ఏంటి అన్న డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. (Twitter/Photo)
ఖుషీ సినిమా 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ నడిచింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాను ముందుగా విజయ్.. తమిళంలో చేసారు. ఆ తర్వాత ఫర్దీన్ ఖాన్, కరీనా కపూర్లు హిందీలో ఖుషీ టైటిల్‌తో ఈ సినిమా చేసారు. ఆ తర్వాత కన్నడలో గణేష్, ప్రియమణి హీరో హీరోయిన్లుగా ‘ఎనో ఊతర’ పేరుతో రీమేక్ అయింది. (Twitter/Photo)