ఇదివరకు పవన్ కళ్యాణ్‌ను పోలీస్ పాత్రలో చూసినప్పుడు వెంటనే గుర్తుకొచ్చే పాట గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్. అందులో లిరిక్స్ పవన్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్గా సరిపోయాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత మరోసారి పవన్ ఒంటిపైకి ఖాకీ చొక్కా వచ్చింది. దాంతో ఆయన సినిమాటిక్ ఇమేజ్‌తో పాటు వ్యక్తిత్వాన్ని కూడా జోడించి అద్భుతమైన లిరిక్స్ అందించాడు రామజోగయ్య శాస్త్రి.
కాస్త ఫోక్, మరి కాస్త మోడ్రన్ మ్యూజిక్ కలగలిసిన ఈ పాటను రవి మిరియాల, పృథ్వి చంద్ర, శ్రీకృష్ణ పాడారు. శివమణి డ్రమ్స్.. తమన్ లైవ్ మ్యూజిక్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అన్నింటికీ మించి పాటలో లిరిక్స్ అదిరిపోయాయి. ఇరగదీసే ఈడి ఫైర్ సల్లగుండా.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గుండా అంటూ పాట మొదలు పెట్టిన రామజోగయ్యశాస్త్రి మధ్యలో ఎన్నో పద ప్రయోగాలు చేశాడు.