ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప 2లో బన్నీ కోసం రాసిన ఓ డైలాగ్ లీకయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు ఊపందుకున్నాయి. ''అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం'' అనే డైలాగ్ పుష్ప 2లో వినబోతున్నాం అని చెప్పుకుంటున్నారు.