తెలుగు ఆడియెన్స్ చేత ఎస్వీఆర్ వారసుడిగా పిలిపించుకున్న కైకాల మరణం టాలీవుడ్‌కి తీరని లోటు అని చెప్పుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమకు కైకాల సత్యనారాయణ పరిచయమైన సినిమా 'సిపాయి కూతురు'. వెండితెర యమ ధర్మరాజుగా కైకాలకు మంచి గుర్తింపు ఉంది. యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా మెప్పించి ప్రేక్షకుల మన్ననలు పొందారు కైకాల.