తెలుగు తెరపై విలక్షణ పాత్రలతో అలరిస్తున్న పోసాని కృష్ణమురళి ఇప్పుడు వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు ? అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పోసాని కృష్ణ మురళి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాస్టర్ బాలు, మాస్టర్ మహేష్ సమర్పణలో బి .యం క్రియేషన్స్ పతాకంపై పప్పుల కనక దుర్గారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.