ఒకప్పటి అందాల తార.. అందమే కాదు నటన, నాట్యంతోనూ తెలుగు వారిని అలరించిన భానుప్రియ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్య స్థితి.. ముఖ్యంగా మెంటల్‌గా స్టేబిలిటీ లేదని తెలుస్తోంది. తెలుగలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భర్త చనిపోయిన తర్వాత నుంచి మెమొరీ లాస్‌తో బాధపడుతున్నాను. ఈ క్రమంలో డ్యాన్స్ హస్తముద్రలు మర్చిపోయాను.. ఈ మధ్య ఓ సినిమా షూటింగ్లో డైలాగులు అన్ని మర్చిపోయానని తెలిపింది. Photo : Twitter
బానుప్రియ పర్సనల్స్ విషయానికి వస్తే.. ఆమె 1967 జనవరి 15న జన్మించారు. ఆల్చిప్పల్లాంటి కన్నులు.. వాలు జడ.. మొత్తంగా బాపూ బొమ్మలా వుంటారు భాను ప్రియ. మరో శ్రీదేవిగా పేరున్న భాను ప్రియ అప్పట్లో ఓ డాన్సింగ్ సెన్సేషన్. అందెల రవళిది పదముల దా అంటూ ఆమె చేసిన నాట్య విన్యాసాలు చూసి మురిసిపోయారు ప్రేక్షకులు. సినిమా డాన్సులేగా? అన్నట్టుండేవి ఆమె నాట్యం చేస్తే. మేల్ యాక్టర్స్ లో బెస్ట్ డాన్సర్ చిరంజీవి అయితే ఫిమేల్ యాక్టర్స్ లో అంత మంచి డాన్సర్ భానుప్రియ అన్న టాకుండేది ఇండస్ట్రీలో... (Facebook/Photos)
భానుప్రియ మొదటి సినిమా తమిళంలో వచ్చింది. తెలుగులో సితారతో తెరంగెట్రం చేశారామె. వంశీ- భాను ప్రియ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ గా వుంటుంది. మహల్లో కోకిల అనే వంశీ నవలకు తెర రూపం సితార. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడంతో భానుప్రియ వెనుదిరిగి చూసుకోలేదు. 1967, జనవరి 15న జన్మించిన భాను ప్రియ అసలు పేరు మంగభాను. (youtube/Credit)
భానుప్రియ తన సినీ కెరీరర్లో 110పైగా సినిమాలు చేశారు. వీటిలో అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలున్నాయి. ముఖ్యంగా నృత్య ప్రధానమైన చిత్రాలంటే దర్శకనిర్మాతలకు ముందుగా ఆమే గుర్తుకు వచ్చేవారు సితార హిట్టవడంతో వంశీ- భానుప్రియ కాంబినేషన్ కు సపరేట్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రేమించు పెళ్లాడు, ఆలాపన, అన్వేషణ వంటి మంచి చిత్రాలొచ్చాయి. ప్రేమించు పెళ్లాడు పెద్ద హిట్ కాలేదు కానీ పాటలు ఇప్పటికీ వినసొంపుగా వుంటాయి. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, వయ్యారీ గోదారమ్మ పాటలు అప్పట్లో ప్రతి ఒక్కరూ హమ్ చేసేవారు. (Facebook/Photo)
అన్వేషణ పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కను చంపిన హంతకులను పసి గట్టేందుకు పక్షులరాగాలపై పరిశోధన చేసే పాత్రలో కనిపిస్తుందీ సినిమాలో భానుప్రియ. కీరవాణి, కిలకిల, ఏకాంత వేళ.. ఇలా అన్వేషణ పాటలన్నీ హిట్లే.. మంచి పాటలకు సూటయ్యే హీరోయిన్ ఎవరంటే భాను ప్రియ బెస్ట్ ఆప్షన్. అందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణ గా నిలుస్తాయి. శ్రీనివాసకళ్యాణం సినిమానే తీసుకుంటే అందులోని తుమ్మెద ఓ తుమ్మెదా ఆ కోవలోకేవస్తుంది.. (Youtube/Credit)
ఇక కే. విశ్వనాథ్ స్వర్ణకమలం భానుప్రియ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫామెన్స్ కు నిలువెత్తు రూపం. ఈ సినిమాలో ఆమె కేరెక్టర్ స్పెషల్ గా వుంటుంది. టాలెంట్ వుండీ దానిపై దృష్టి పెట్టని అమ్మాయిగా నటించి అదుర్స్ అనిపించింది. ఈ సినిమా పాటలు.. వాటికి భానుప్రియ మాత్రమే చేయగల డాన్సులూ అబ్బో.. చెప్పడం కంటే చూడ్డం బెటర్ అన్నారు ప్రేక్షకులు.. (Youtube/Credit)
డాన్సింగ్ క్వీన్ కావడంతో బ్రేక్ డాన్సర్ అయిన చిరంజీవితో అనేక సినిమాలు చేసారు భాను ప్రియ. చిరంజీవి, జ్వాల, విజేత, చక్రవర్తి, దొంగమొగుడు, జేబుదొంగ, స్టేట్ రౌడీ, త్రినేత్రుడు.. ఇలా పలు చిత్రాల్లో మెగాస్టార్ తో కలిసి నటించారామె. చిరంజీవితో భాను ప్రియ చేసిన చిత్రాలన్నిటిలోకీ బిగ్గెస్ట్ హిట్ ఖైదీ నెంబర్ 786. ఈ సినిమాలోని పాటలు వేటికవే హిట్. (Youtube/Credit)
అమెరికాలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌషల్ అనే ఫోటోగ్రాఫర్ ని మేరేజ్ చేసుకున్నారు భానుప్రియ. వారిద్దరికీ అభినయ అనే పాప కూడా వుంది. ప్రస్తుతం భర్తతో విడిపోయారీ డాన్సింగ్ క్వీన్. కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ఇస్తూ మధ్య మధ్య.. తగిన పాత్రలు దొరికినప్పుడు టీవీ సినిమాల్లో చేస్తూ.. గడుపుతున్నారు. 2018లో భానుప్రియ భర్త అనారోగ్యంతో కన్నుమూసారు. (Twitter/Photo)
భానుప్రియ భారతీయుడులో ఊర్మిళకు, కాజల్, రంభ, నివేదిత జైన్, మనీషా కొయిరాల వంటి హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పి భళా అనిపించారు. అభినయానికి పెట్టింది పేరు భానుప్రియ. తెలుగులో అప్పటి అగ్ర హీరోలు కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో ఆడిపాడింది భానుప్రియ. తెలుగులో చివరగా ‘మహానటి’లో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించింది భానుప్రియ (file/Photo)