Poorna : పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తాజాగా ఈమె దీపావళి రోజున తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. Photo : Instagram
పూర్ణ .. మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టనున్నారు. ప్రముఖ జెబిఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీని వివాహా మాడనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈమెకు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మే లో వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్‌లో పెళ్లి అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. (Instagram/Photo)
పూర్ణ పెళ్లి (నిఖా) ముస్లిమ్ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఒంటిపై నగలతో బంగారు బుట్టబొమ్మను మరిపించేలా పెళ్లి కూతురిగా పూర్ణ గెటప్ బాగుంది. ఈ సందర్భంగా నేను ప్రపంచంలో నేను గ్లామరస్ లేడీ కాకపోవచ్చు. మంచి పార్టనర్‌ను కాకపోయినా.. నువ్వు అందించిన సహకారం మరవలేనిది అంటూ తన భర్తపై ప్రేమను పంచుకుంది. (Instagram/Photo)
పూర్ణ విషయానికొస్తే.. నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Photo: Instagram.com/shamnakasim