Poorna : పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తాజాగా సంప్రదాయ చీరకట్టులో బాపు బొమ్మలా మెరిసిపోతుంది ఈ భామ. (Photo : Instagram/Poorna )
అంతే కాకుండా..ఆ మధ్య వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది పూర్ణ.. (Photo : Instagram/shmna Khasim)
పూర్ణ గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలోను నటించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda) మూవీ 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. (Photo:Instagram.com/shamnakasim
ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్ణ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. (Instagram/Photo)
రీసెంట్గా పూర్ణ, అసిఫ్ అలీ ఎంగేజ్మెంట్ కేరళలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించి పూర్ణ కొన్ని ఫోటోలను, ఓ వీడియోను పంచుకున్నారు. ఇక తాజాగా వీళ్లిద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయనే టాక్ వచ్చింది. ఈమె వేరే అతనితో డేటింగ్ చేస్తోందన్న వార్తలతో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్న వార్తలు వచ్చాయి. .poorna engagement Instagram
పూర్ణకు కాబోయే అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈఓ. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు కూడా. జమా అల్ మెహరి అనే కన్సల్టెన్సీ స్థాపించి కొత్త ఆఫీస్‌లకు ప్రారంభించడానికి కావాలసిన సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. అంతేకాదు ఎంతో మంది సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను ఏర్పాటు చేస్తుంటాడు. (Instagram/ShamnaKhasim)
పూర్ణ విషయానికొస్తే.. నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Photo: Instagram.com/shamnakasim