ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఓ టీజర్‌ను విడుదల చేయగా.. ఆ టీజర్ మంచి ఆదరణ పొందింది. దీనికి తోడు ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది. Photo: Instagram.com/shamnakasim
ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo: Instagram.com/shamnakasim