ఆమె మాట్లాడుతూ.. ఓ సమయంలో ఈ సినిమాలను వదిలేసి చక్కగా పెళ్లి చేసుకుని దేశం విడిచి వెళ్లిపోదామనుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చిన కొందరు రావణులు అడ్డుకున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు తన జీవితంలోకి వచ్చి నాశనం చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. Photo : Twitter
ఈ వ్యాధి ఉన్నవాళ్లు అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి ఉంటాయట. ఏది ఏమైనా త్వరగా కోలుకోని మాములు మనిషి కావాలని ఆమె సన్నిహితులుతో పాటు అందరు కోరుకుంటున్నారు. మరోవైపు పూనమ్ కౌర్ ఆ మధ్య తాను ఓ దర్శకుడి వల్ల మోసపోయినట్టు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ దర్శకుడు తనని వాడుకుని వదిలేశారని.. అలాగే ఓ హీరో వల్ల ప్రేమలో మోసపోయినట్టు ఆరోపణలు చేశారు పూనమ్. Photo : Twitter