పూజా హెగ్డేకు గతేడాది అసలు కలిసి రాలేదనే చెప్పాలి.2022 చివర్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. దీంతో 2022 ఈ భామకు కలిసి రాలేదునే చెప్పాలి .2023లో ఈ భామకు అదృష్టం కలిసొస్తుందా అనే చూడాలి. (Photos/Pooja Hegde/Instagram)
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. అంతేకాదు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో బిజీగా ఉంది. లాస్ట్ ఇయర్ ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా.. ఈమె హవా మాత్రం తగ్గడం లేదు. (Photos/Pooja Hegde/Instagram)
ఈ సినిమా ఫెయిలైన ఆ తర్వాత విజయ్‌తో ‘బీస్ట్’ చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు అంతగా నడవకపోయినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అటు యేడాది చివర్లో రణ్‌బీర్ సింగ్‌తో చేసిన ‘ సర్కస్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అంతేకాదు ఈ భామ ఇప్పటికే వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉంది. తాజాగా సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు సినిమా షూటింగ్లో పాల్గొననుంది. (Photos/Pooja Hegde/Instagram)
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. ఇక రంగస్థలం తర్వాత ఈ యేడాది మరోసారి ఎఫ్ 3లో ఐటెం భామగా చిందేసింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించడం ఒక్కటే పూజాకు ఊరట. (Photos/Pooja Hegde/Instagram)
కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళం, హిందీలోనూ పూజాకు అవకాశాలు వస్తున్నాయి. అన్ని భాషల్లోంచి వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కథలు నచ్చకపోతే కొన్ని సినిమాలను నిర్ధాక్షణ్యంగా నో చెప్తుంది కూడా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాలో ఈమె నటిస్తోంది. అటు మహేష్ బాబుతో వరుసగా రెండో సినిమా చేస్తోంది. అటు త్రివిక్రమ్‌తో ఈమెకు అరవింద సమేత వీరరాఘవ’, అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో నటిస్తోంది.(Instagram/Photo)
అటు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలు చేస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది రంజాన్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే అన్నయ్య పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమాలో కెమియో రోల్ల్ యాక్ట్ చేస్తున్నారు.మొత్తంగా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతోంది. మొత్తంగా 2022లో వరుసగా రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, తాజాాగా సర్కస్ ఫ్లాపులు ఈ అమ్మడి జోరుకు బ్రేకులు వేసాయనే చెప్పాలి. (Photos/Pooja Hegde/Instagram)
ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు,ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు (Photos/Pooja Hegde/Instagram)
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం పూజా హెగ్డేను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 21.8 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.(Photos/Pooja Hegde/Instagram)