2022 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పాల్గొనేందుకు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాకు చేరుకుంది పూజా హెగ్డే. అయితే ఈ ప్రత్యేకమైన వేడుకకు అటెండ్ కావడం ఓ హానర్ గా భావించిన ఆమె.. వేడుకలో స్పెషల్ అయ్యేలా డ్రెస్ వేసి తళుక్కున మెరిసింది. బెంగళూరులో తెగ హల్చల్ చేసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాల్లో నటించిన ఈ బుట్టబొమ్మ.. వరుసపెట్టి భారీ చిత్రాల్లో భాగమవుతోంది. ప్రస్తుతం ఫ్రీ టైమ్ ఎంజాయ్ చేస్తూ వెకేషన్ ట్రిప్స్ వేస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన పూజా కెరీర్ ఈ మధ్య కాలంలో మాత్రం స్లో అయింది. దీంతో ఆమెను ఐరెన్ లెగ్ అంటూ ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేయడం కూడా చూస్తున్నాం.