సౌత్ సినిమాలతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్లో లెగ్ పెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ‘హౌస్ఫుల్ 4’లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె వెంకటేష్ చెల్లెలు పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాతో చాలా యేళ్ల తర్వాత వెంకీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ యేడాది పూజా హెగ్డే నటించిన రెండు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’ ప్రేక్షకులు తిరస్కారానికి గురైన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)Pooja hegde Photo Twitter
నభా నటేష్ | ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. ఈమె స్వస్థలం కర్ణాటకలోని శృంగేరి. (Instragram/Photo)
శ్రీలీల విషయానికొస్తే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటిస్తున్నారు.ఈమె పుట్టి పెరిగింది కర్నాటక రాజధాని బెంగళూరు కావడం విశేషం. (Twitter/Photo)