Rashmika Mandana -Pooja Hegde In Bollywood | సౌత్ హీరోయిన్స్ నార్త్‌లో నటించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలనాటి వైజయంతి మాల, రేఖ, శ్రీదేవి, జయప్రద నుంచి ఇప్పటి తరం ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే వరకు చాలా మంది భామలు సౌత్ నుంచి వెళ్లి నార్త్ (బాలీవుడ్)లో సత్తా చాటినవాళ్లే. ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్లో నటించింది. లేటెస్ట్గా రష్మిక మందన్న కూడా బాలీవుడ్ ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ వెళుతుంది. వీళ్ల కంటే ముందు బీ టౌన్లో సత్తా చాటిన దక్షిణాది హీరోయిన్స్ ఇంకెవరున్నారంటే.. (Pooja Hegde Rashmika Mandanna)
స్వతహాగా నార్త్ అమ్మాయి అయిన కాజల్ అగర్వాల్ 2004లో ‘క్యూ హో గయా నా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్గా సత్తా చూపెట్టింది. ఆ తర్వాత అజయ్ దేవ్‌గణ్ ‘సింగం’ సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’, ‘దో లబ్జోంకీ కహాని’ వంటి పలు బీ టౌన్ సినిమాల్లో నటించింది. (Twitter/Photo)