సౌత్ హీరోయిన్స్ నార్త్‌లో నటించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలనాటి వైజయంతి మాల, రేఖ, శ్రీదేవి, జయప్రద నుంచి ఇప్పటి తరం ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే వరకు చాలా మంది భామలు సౌత్ నుంచి వెళ్లి నార్త్ (బాలీవుడ్)లో సత్తా చాటినవాళ్లే. ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్లో నటించింది. ఇప్పటికే రష్మిక మందన్న ’పుష్ప’ హిందీ ప్రేక్షకులకు చేరువైంది. దీంతో పాటు ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్ట్ నటిస్తూ అక్కడ లక్ పరీక్షించుకుంటోంది. (File/Photo)
రష్మిక మందన్న బాలీవుడ్లో ’టాప్ టక్కర్’ అనే ప్రైవేటు ఆల్బమ్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఫోటోలో తలపాగాతో రెండు చేతులు పెట్టి రష్మిక నవ్వుతూ ఉన్న ఫోటో ఇపుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ ఫోటోను సోషల్ మీడియాలో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోగా రికార్డులకు ఎక్కింది. దీంతో రష్మిక గురించి బాలీవుడ్ ప్రేక్షకులు గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. (Rashmika mandanna Photo : Twitter)
’టాప్ టక్కర్’ పాటతో పూజా హెగ్డేను కంటే ఎక్కువ పాపులారిటీని రష్మిక మందన్న బాలీవుడ్లో దక్కించుకుంది. ఈమె ఫోటోను మిషన్ మజ్ను డైరెక్టర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసి ఆమె నటనకు ఫిదా అయి ఆమెకు బాలీవుడ్ ఛాన్స్ ఇచ్చాడట.ఇక అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’లో శ్రీవల్లిగా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను రష్మిక ఫిదా చేసిన సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)
సౌత్ సినిమాలతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్లో లెగ్ పెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘కభీ ఈద్ కభీ దీవాళి’ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె వెంకటేష్ చెల్లెలు పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాతో చాలా యేళ్ల తర్వాత వెంకీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ యేడాది పూజా హెగ్డే నటించిన రెండు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’ ప్రేక్షకులు తిరస్కారానికి గురైన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ప్రణీత సుభాష్ | ఇక ప్రణీత సుభాష్ .. అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కిన ‘భుజ్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘హంగామా 2’ మూవీతో బీ టౌన్ ప్రేక్షకులను పలకరించింది. (Twitter/Photo)
సమంత | సమంత కూడా బాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వకపోయినా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది . నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’లోని ఊ అంటావా ఐటెం సాంగ్‌తో పాపులర్ అయింది. ఈ భామ.. త్వరలో బాలీవుడ్‌తో పాటు ఓ హాలీవుడ్లో చిత్రంలో నటించేందకు ఓకే చెప్పింది. ‘ది అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. (Youtube/Amazon Prime/Photo)
జల్ అగర్వాల్ | స్వతహాగా నార్త్ అమ్మాయి అయిన కాజల్ అగర్వాల్ 2004లో ‘క్యూ హో గయా నా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్గా సత్తా చూపెట్టింది. ఇక అజయ్ దేవ్‌గణ్ ‘సింగం’ సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’, ‘దో లబ్జోంకీ కహాని’ వంటి పలు బీ టౌన్ సినిమాల్లో నటించింది. (Twitter/Photo)
తమన్నా | 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈమెది స్వతహాగా ఉత్తరాది అమ్మాయి. ఆ తర్వాత అదే యేడాది మంచు మనోజ్ హీరోగా నటించిన ’శ్రీ’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ అజయ్ దేవ్‌గణ్ ‘హిమ్మత్వాలా’తో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. (Twitter/Photo)