POOJA HEGDE TO BE PART OF PAWAN KALYAN BHAVADEEYUDU BHAGAT SINGH SB
Pawan Kalyan: వరుస సినిమాలు ప్లాప్స్ అయినా.. పవన్ సినిమాలో ఆమెనే హీరోయిన్!
పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుండగా ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీలో పూజానే హీరోయిన్ గా ఫిక్స్ చేసిన యూనిట్, త్వరలో అఫీషియల్ గా ఆమెను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
తర్వాత పవర్ స్టార్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తోన్న హరిహర వీర మల్లు పస్ట్ లుక్ వచ్చిన విషయం తెలిసిందే.
2/ 13
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
3/ 13
నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు అనే యోధుడి పాత్ర చేస్తుండగా దీనిని పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ గా దర్శకుడు క్రిష్ తీస్తున్నారు.
4/ 13
డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో పవర్ స్టార్ మరో సినిమా తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ని ఖరారు చేసిన ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్.
5/ 13
హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సొంత కథలతో వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పవన్ ఫ్యాన్స్’ను ఎంతగానో ఆకట్టుకుంది.
6/ 13
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా భవదీయుడు భగత్‌సింగ్ మూవీ తెరకెక్కనుండగా ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
7/ 13
లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ మూవీలో పూజానే హీరోయిన్ గా ఫిక్స్ చేసిన యూనిట్, త్వరలో అఫీషియల్ గా ఆమెను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
8/ 13
పూజా హెగ్డే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ హిందీ ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.
9/ 13
మొదలు. పెట్టిన ఆరేళ్లలోనే పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించుకుని అన్ని భాషల్లో సత్తా చూపిస్తుంది పూజా హెగ్డే. అయితే పూజా కొందరి హీరోల సినిమాలు రిజక్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.
10/ 13
అయితే పూజ ఇటీవలే నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. బీస్ట్,ఆచార్య,రాధేశ్యాం.. మూడు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో పూజాపై పలువురు నెటిజన్స్ ట్రోలింగ్ కూడా చేశారు.
11/ 13
పూజా సినిమాలు ఇప్పుడు ప్లాప్ అయినా.. ఆమెకు అలవైకుంఠపురం,మహర్షి వంటి హిట్ సినిమాల్లో కూడా నటించిందని ఆమె ఫ్యాన్స్ పూజాకు సపోర్టు చేస్తుననారు. అయితే తాజాగా పూజా..పవన్ సినిమాలో చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
12/ 13
పూజా పవన్ సినిమాలో చేస్తుందని తెలియడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. తొలిసారిగా పవర్ స్టార్ ప్రక్కన పూజాని చూడవచ్చని ఆనందపడుతున్నారు. ఈ మూవీ త్వరలో పట్టాలెక్కి వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
13/ 13
అయితే పూజా హెగ్డే మాత్రం గతంలో పవన్‌తో సినిమా చేసే అవకాశాన్ని కాదనుకుంది. ఒక సారి కాదు రెండు సార్లు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా మిస్ చేసుకుంది పూజా హెగ్డే. మరి ఇప్పుడైనా సినిమా ఛాన్స్ వదులకోకుండా నటిస్తుందో లేదో చూడాలి,